అమరావతి ప్రాశస్త్యం గూర్చి అధ్యక్ష కవితోపన్యాసికలో వీలయినంత సమగ్రంగా పేర్కొన్నాను. ఇప్పుడు అమరావతి పుట్టుక పూర్వం మాదిగలు దాని నిర్మాణంలో ప్రఖ్యాతిలో వహించిన పాత్ర గూర్చి వివరించటం లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంయ నిర్వహించిన కవి సమ్మేళనం (21-3-2015) అధ్యక్షుడిగా చేసిన ప్రసంగంలో చారిత్రకంగా అమరావతి నిర్వహించిన పాత్ర - దాని వైశిష్ట్యం ప్రస్తావించాను.

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడ్డాక, రాయలసీమ నాలుగు జిల్లాలతో కూడిన సర్కారు తొమ్మిది జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు నూత్న రాజధాని నిర్మించుకోవలసి వచ్చిన అవసరం ఆంధ్రులందరికీ అవగత పూర్వకమే!

అందుకోసమే ఏర్పాటు చేసిన కమీషన్‌ పలు అంశాలు పరిశీలించి కొన్ని ప్రాంతాల ఆనుకూల్యం గుర్తించింది. ప్రజలు తమ తమ అభీష్టాల మేరకు రాష్ట్ర రాజధాని నిర్మించదగ్గ ప్రాంతాలు కొన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొనే దశ వచ్చి&ంది.

ఆ సమయంలో ఈ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన తొట్టతొలి ఉగాది పర్వదినం అనంతవరంలో 21-3-2015న ప్రభుత్వం జరిపింది. దీనితో ప్రజల ఊహాగానాలు, రాజధాని విషయంలో ప్రారంభమయ్యాయి.

శ్రీమన్మథనామ ఉగాది పర్వదిన సందర్భంలో ఏర్పాటుచేసిన కవిసమ్మేళనం, విజయవాడ, ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఆరోజే ప్రపంచ కవితా దినోత్సవం కావటం ఒక అద్బుత సందర్బం. ఈ ఆంధ్రప్రదేశ్‌ జరిపిన మొట్టమొదటి ఉగాది పర్వదినం కావటం పరమానందకర ప్రత్యేక విశేషం.

'ఈ త్రివేణీ సంగమానికి అధ్యక్షుణ్ణి కావటం

నా అర్హత కంటే మీ ఔదార్యం మిక్కుటం'

...   

గాథా సప్తశక్తి

అమరావతి పట్టణమంటే నాకు అమితప్రేమ. ఇందుకు కారణం అది ప్రాచీనమైన పట్టణం కావటమే. అంతకు పూర్వం పుట్టి ఇప్పటికీ నిలచి ఉన్న పట్టణం మరొకటి ఆంధ్రప్రదేశ్‌ లేకపోవటమే. ఇది క్రీ.పూ. 500 సంవత్సరాలకంటే ముందునుంచి ఆంధ్రుల అస్తిత్వానికి మూలస్థానంగా ఉంది. ధాన్యకటంక - ధనకటకం - ధరణికోట పూర్వవైభవం పూర్తిగా నిలుపుకోవలసి ఉంది.... 

పేజీలు : 150

Write a review

Note: HTML is not translated!
Bad           Good