ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో  ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునేంత అపురూపమైనవేమి లేవు తనకి....
ఫణి పుట్టిన క్షణం నుంచి తనకి దివ్యజ్యోతి దర్శనం అయినట్టే ఉంది. ఆ వెలుగులో భర్త పోయినా చీకటి రూపు లేకుండా పోయింది. ఫానే తను ! తనే ఫణి అనిపిస్తుంది... ఇరుగు పొరుగు పిల్లలు ఎంత మందో తల్లిదండ్రుల మాట వినకుండా ఎదురు తిరిగుతున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. అమరకి అది చూస్తె భయం. తనకి ఈ శాపం నీడ పడకూడదని దాని నుంచి తనని, ఫణి ని  రక్షించుకోవాలని అమర ఆరాటం. !
అమర, సుజాత సన్నిహితులు . సుజాత భర్త కృష్ణ చైతన్య . కృష్ణ చైతన్య అమరని ఎంతగానే కోరు కుంటాడు. అయితే అమరకి వేరొకరితో పెళ్లివుతుంది. ఫణి పుడతాడు. కృష్ణ చైతన్య తన తండ్రికీ అయన సెక్రటరీ పుట్టిన బిడ్డని తెచ్చి పెంచుకుంటాడు. అతడే రాజా . అయితే రాజా ప్రమాద వశాత్తు బావిలో పడి చనిపోతాడు. ఆ నేరం ఫణి పై పడుతుంది. రాజా మరణం సుజాతని కుంగదీస్తుంది. ఆ షాక్ తో ఆమె కూడా మరణిస్తుంది. కల్లోలంలో చిక్కు కున్న వారి జీవితాలు చివరికి ఏ మలుపు తిరిగాయి.  ?
అమర ఫణి కాపాడు కోగలిగిందా. ? కృష్ణ చైతన్య ఆమెను ఆదరిం చాడా ? ఆద్యంతం ఏకబిగిన చదివించే యద్దన పూడి సులోచనా రాణి మరో నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good