సమస్త మానవాళి రోగరహితంగా ఉండాలంటే, జాతి జనుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే వైద్య విజ్ఞానంపై - ప్రజలకు అవగాహన కల్గించాలని - మన రాష్ట్రపతి స్వర్గీయ శంకర్ దయాళ్ శర్మ ఓ సందర్భంలో అన్నారు. అయన వచనాన్ని స్పూర్తిగా గ్రహించి, ప్రజలకు ఈ సదవగాహన కల్పించేందుకు మా ప్రచురణ  సంస్థ తరపున మేము ఆరోగ్యం సీరీస్ పేరిట కొన్ని వైద్య విజ్ఞాన గ్రంధా అంశాలను లఘు రూపంలో పుస్తకాలుగా తీసుకురావాలని సంకల్పించాము.  మొదటి నుంచి మా ప్రచురణ సంస్థ పట్ల ఆత్మీయమైన అభిమానాదరణలు చూపుతున్న పారంపర్య వైద్య  నిపుణులు, ఈ లఘు పుస్తకం సంకలన కర్త అయిన   శ్రీ గుణవర్ధన్ గారిని సంప్రదించగా వైద్య విజ్ఞానం  ప్రజలకు అందిచడంలో కీలక పత్రికలన్నీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good