ఆ భిక్షుకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు.  ''ఏంకావాలి?'' అనడిగాడు.  ''ఈ భిక్షాపాత్రను నింపండి'' అన్నాడు భిక్షుకుడు.  ''దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను'' అన్నాడు రాజు.  ''ఏవైనా ఫరవాలేదు, కానీ, అంచులదాకా నింపడం మరవకండి'' అన్నాడు భిక్షుకుడు.  రాజు తన ధనాగారం నుంచి వజ్రాలు తెప్పించాడు.  వేసిన వజ్రాలు వేసినట్టే మాయమౌతున్నాయి.  రాజువద్దనున్న వజ్రాలన్నీ అదృశ్యమయ్యాయికానీ భిక్షుకునిపాత్ర మాత్రం ఖాళీగానే ఉంది. 

రాజు భిక్షుకుడి కాళ్ళపైబడి ''మీరెవరో అసాధారణ పురుషులు.  ఈ భిక్షాపాత్రలో ఏమిమహత్తు ఉందో తెలియడం లేదు.  దీనిని దేంతో నిర్మించారో చెప్పండి'' అని వేడుకున్నాడు.

''దీనిని మనిషి పుర్రెతో నిర్మించాను రాజా!  అందువలననే దీనికి అసలు తృప్తి అంటూలేదు.  అన్నింటినీ దిగమ్రింగి, మరికొన్నింటికై ఎదురు చూస్తూ ఉంటుంది'' అన్నాడు భిక్షుకుడు.

మానవుని మనస్సు, మేధస్సులగూర్చి ఇంత లోతైన చింతనగావించిన మహాపురుషుల బోధనలెన్నో....- నీలంరాజు లక్ష్మీప్రసాద్‌ ద్వారా

Pages : 163

Write a review

Note: HTML is not translated!
Bad           Good