మీరు చదువుతున్న ఈ పుస్తకంలో 14 కధలున్నాయి. వివిధ సామాజికాంశాల స్పందనలు ఈ కధలు - వస్తువు, శైలి, శిల్పం, - మూడింటిపైన తగిన శ్రద్ధ తో రచయిత కధను నగిషీ చెక్కారనిపిస్తుంది. సెజ్ (ఆర్దిక మండలి) భూతం కథే తీసుకోండి . వేలాది మంది రైతుల జీవితాలకు ఇది ఒక నమూనా. దేశంలోనే అత్యధిక సెజ్ లున్న రాష్ట్రం మనది. పారిశ్రామీకరణ పేరుతొ ప్రభుత్వం లక్షలాది ఎకరాలను సేకరించి.. పారిశ్రామిక వేత్తల చేతుల్లో పెట్టి రైతును భూమి లేని వాడ్ని చేసింది. ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం ఇస్తుంది. చుటుపక్కల భూముల ధరలన్నీ పెరిగిపోతాయి. అది కొనే తాహతు రైతుకు ఉండదు. పరిశ్రమలు రావు. ఉపాది ఉండదు. రైతు తన చేతికందిన డబ్బు అప్పుల వాళ్ళ చేతిలో పోసి. గత్యంతరం లేక - తనే కూలీగా మారిపోతాడు. .. మొక్కి వంగని అవినీతి.. వసు పెళ్లి నిర్ణయం.. అమ్మాయి పెళ్లి.. పరాజయం... డైటింగ్ జబ్బు...బందు.. నాన్నా నన్ను బ్రతికించలేవా ? కొడుకులు..రాగింగ్ రాక్షసి... 

Write a review

Note: HTML is not translated!
Bad           Good