భారతరాజకీయాకాశంలో అంధకారం వ్యాపించింది. పేను మేఘాలు దట్టంగా కమ్మివేసాయి. ఆ మేఘాలను తరిమి కొట్టడానికి తెలుగు పుడమి పైన ఒక అసహాయ శూరుడు అవతరించాడు. ఆయనే అల్లూరి సీతారామరాజు. మన్యం కొండల్లో వరుసగా మూడేండ్లు బ్రిటీషు ముష్కరులతో పోరాడిన యోధుడితడు. జాతీయ నాయకులే ఆయన వీరత్వాన్ని శ్లాఘించారు.
గాంధీజీ:
"శ్రీ రామరాజు యొక్క దౌర్జన్య పద్దతులతో నేనేకీభవించజాలకపోయిననూ ఆయన అకుంఠిత సాహసమూ, త్యాగ దీక్ష, ఏకాగ్రత, ఉత్తమ శీలమూ, నిరాడంబరమగు కష్ట జీవనము మనమందరమూనేర్వదగినవి."
జవహరలాల్ నెహ్రూ:
"నా దురదృష్టవశాత్తూ శ్రీ రామరాజు గురించి విశేషంగా తెలియదు కాని, తెలుసుకునేంతవరకు అతడు వేళ్ళపై లెక్కించదగిన స్వల్ప సంఖ్యాకులగు అనుచరుల సహాయంతో బ్రిటిష్ ప్రభుత్వంను గడగడలాడించిన ధైర్యసాహసోపేతుడగు వీరుడని స్పష్టపడినది."

Write a review

Note: HTML is not translated!
Bad           Good