వెంటనే అన్నాడు వంశీ "ఒప్పుకుంటాను. తప్పనిసరిగా అంగీకరించాలి, అభినందించాలి. కాని, ఎంత మారినా మన చుట్టూ ఉన్న సమాజం పురోగతి సాధించినా, గుండెలోతుల్లో దాగి వున్న ప్రేమా, అభిమానం దూరమవకూడదు. వాటిని ప్రకటించే విధానం మాత్రం ఈనాడు మారిపోయింది. భావాలు ఒకరి నుంచి ఒకరికి వ్యక్తమవ్వాలంటే కమ్యూనికేషన్ సరిగ్గా వుండాలి. అయితే, దానిని సరిగ్గా భావప్రసారం చేసే సమయం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. అంతా బిజీ బిజీ.

పని ఒత్తిడి వల్ల కావొచ్చు. పోటీ తత్వం కావొచ్చు. మనిషి ఎదుగుతున్నా, సమాంతర కోరికలు కూడా పెరుగుతూనే వుండవచ్చు. కానీ, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి యింకా సమయాన్ని ఆర్జించే దిశగా మనిషి ముందుకుపోతున్నాడు. కొన్ని సవ్యమైనవి, కొన్ని అపసవ్యమైనవి. ఒకవేళ కొండంత ప్రేమ వున్నా ప్రదర్శించే తీరికేది? ఇలా సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యలేక యీ తరం, అది అర్ధమయినా జీర్ణించుకోలేక మన పై తరం సతమతమవుతున్నారు. చాలా సున్నితమైన విషయం యిది".

Write a review

Note: HTML is not translated!
Bad           Good