నీరు మనకెంత ముఖ్యమో మీకందరకు తెలిసిన విషయము. ప్రాణవాయువు తర్వాత నీరు అత్యవసరము, తదుపరి ఆహారము. ఆహారము లేకపోయిన ప్రాణవాయువును ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా స్వీకరిస్తూ నీటిని సేవిస్తూ కొంతకాలమైనా బతకవచ్చు. ఈ గ్రంథంలో నీరు - స్వభావము-నీటిలోగల పదార్థములు, నీటి నాణ్యత నీటి వడపోత విధానములు - ముఖ్యముగా ఈనాడు గృహములలో ఇతర వాణిజ్య సంస్థలు అనుసరిస్తున్న రివర్సు ఆస్మాసిస్‌ గురించి చాలా విపులంగా చర్చించుట జరిగింది.

    ఈనాడు నిత్యావసర, ఎమర్జెన్సీ వస్తువుగ మారిన 'మినరల్‌ వాటర్‌ బాలిల్సు' నీటి విశ్లేషణ-వ్యర్థాల ఏరివేత, నీటి కాఠిన్యతను కొలుచుట, నీరు ఏవిధంగా స్వయం క్రిమిసంహారం చేయును అనే విషయం విపులీకరించడమైనది. నీరు తాగకపోవుటవలన, తాగినా పరిమితంగా తాగుటవలన వచ్చే అనర్థాలు, మితము, పరిమితం కాకుండా తగు మోతాదులో నీటిని సేవిస్తే అది మనిషికి గల అవయవాలకు వచ్చే వ్యాధులను ఏ విధంగా నివారిస్తుందో, దానికిగల ఆ అద్భుత నివారణశక్తిని ఎలా కలిగివుందనే విషయాన్ని తెలుసుకోగలరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good