రైళ్ళలో, పుణ్యక్షేత్రాలలో, అంగళ్లలో, ¬టళ్ల దగ్గర... ఎక్కడ చూచినా కనబడతాడు బిచ్చగాడు - విశ్వవ్యాపిగా, ఈ ముష్టివాళ్ళిలా వీధులలో కనబడడం దేశానికి కళంకం వంటిదని పెద్దలన్నారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు వీళ్ళను గురించి శ్రద్ధ తీసుకొని, మచ్చుకైనా ముష్టివాడు తమ దేశంలో కనబడకుండా ఏర్పాట్లు చేశారు. ధర్మక్షేత్ర మనుకునే మన భారత దేశానికి, ఈనాటికీ గూడా, ఆ అదృష్టం కలగలేదు. ఇది చింతాకరమని చెప్పనక్కరలేదు.

    ఈ ముష్టివారి సమస్యను గూర్చి ఆలోచించని సహృదయులుండరు. ఈలాగున ఉన్నందుకు దు:ఖించని దేశభక్తులుండరు. ఇతర దేశాలలో కానరాని ఈ దురవస్థ మనకు కలిగినందులకు లజ్జపొందని ఉదార స్వభావులుండరు.

    అందరూ సమానంగా ఉండవలసిన మానవ సమాజంలో ముష్టియెత్తుకోవలసిన గతి ఎందుకు వచ్చింది? అని రచయిత ఆలోచించారు.

    ఇరవైయేళ్ళ క్రితం ''అడగజాలనివాడు'' అన్న పేరుతో, ఈ అడుక్కోవడం గురించి కొన్ని వ్యాసాలు ''కాగడా'' పత్రికలో ప్రచురించారు. ఆ వ్యాసాలు పాఠక మహాశయుల అభిమానాన్ని సంపాదించ గలిగాయి. తరువాత ''అడుక్కుతినే ముష్టివాళ్ళు'' అన్న శీర్షికతో కొన్ని ''యథార్థ కథలు'' ప్రచురించారు. ఆ తరువాత ''ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ'' అన్న శీర్షికతో ఒక వ్యాసం, ''దుష్టబుద్ధి'' అన్న పేరుతో జనవాణి (వారపత్రిక) జన్మదిన సంచికలో వ్యంగ్య రచనగా ప్రచురించారు. వీటన్నింటిని కలిపి ఇప్పుడీ గ్రంథరూపంగా ఆంధ్ర సహృదయులకు సమర్పిస్తున్నారు రచయిత.

    చీనా, రష్యా మొదలయిన దేశాలను చూచి వచ్చిన మన భారతీయ ప్రముఖులు చెప్పిన మాటలను పట్టి చూస్తే ఆ దేశాలలో ముష్టివాడెక్కడా కనబడడని తేటపడుతుంది. మన దేశంలో గూడా ఇలా ఎందు కుండగూడదు? అన్న హృదయావేదనే ఈ రచనకు కారణం అని మనవి చేస్తున్నారు.

    నిజమే? కాలూ చెయ్యీ బాగుండీ, ముష్టి ఎత్తడానికి 'యోగ్యత'' లేనివారు చాలామంది ముష్టివాళ్ళలో కనబడతారు. తగిన యేర్పాట్లు చేసి, అటువంటి వారికి పనులు కల్పించి నట్లయితే దేశాభ్యుదయానికీ దోహదం చేసిన వారమవుతాం. గత్యంతరం లేనివారికి, విధిగా కూడూ గుడ్డా వసతీ కల్పించాలి. దేశంలో ధనం లేకపోలేదు. కావలసినదంతా హృదయం; భారతభూమి సుందరాకారం మీద కళంకం లాగా ఉన్న ఈ దుర్గతిని తొలగించాలన్న సదభిప్రాయం కావాలి అంతే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good