ఈ రోజుల్లో చాలామంది ఎలియనేషన్‌ గురించి విని వుంటారు. ఆ మాట వినియోగించి ఉంటారు. చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్పినా మార్క్స్‌ చెప్పిన ఎలియనేషన్‌ సిద్ధాంతం అన్ని విమర్శలను తట్టుకుని నిలిచింది. పరాయీకరణ భావన మార్క్స్‌ పేరుతో ముడిపడి పోయింది. ఆ సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ పుస్తకం.

మానవత్వం ‘అలంకారం’ కాదు. అది మన ఆయుధం. మన మానవత్వాన్ని మనకు కాకుండా చేస్తున్న పరాయీకరణకు వ్యతిరేకంగా మానవత్వం కోసం, మానవత్వాన్ని ఆయుధంగా పూని పోరాడుదాం. ఉత్పత్తి రంగం నుండి జనించే పరాయీకరణకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ పోరాటానికి పక్కనే, దానికి మద్దతుగా సాంస్కృతిక, భావజాల పోరాటం జరపవలసి ఉంది. ప్రేమించడం మానవ స్వభావంలో ముఖ్య భాగమని మార్క్స్‌ పేర్కొన్నాడు. భూత, భవిష్యత్‌, వర్తమానా మానవాళిని ప్రేమిద్దాం. మన ఉనికికి మూలమైన ప్రకృతిని ప్రేమిద్దాం. దానికి హాని చేసేవారిని ద్వేషిద్దాం. చివరగా ఎంగెల్స్‌ మహాశయుడు చెప్పినట్లుగా ‘అమానవీయమైన పరిస్థితులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో మాత్రమే మనం మానవులుగా మిగులుతాం’ అనే విషయాన్ని గుర్తించి ఆచరిద్దాం.

పేజీలు : 143

Write a review

Note: HTML is not translated!
Bad           Good