Rs.150.00
Price in reward points: 150
Out Of Stock
-
+
తెలుగు సాహిత్యంలో స్త్రీవాద రచనలను సాధికారికంగా ప్రవేశపెట్టిన రచయిత ఓల్గా. కథ, కవిత, నవల, సాహిత్య విమర్శ ఆ ప్రక్రియలన్నింటిలో ఆమె చేసిన అవిరళ కృషి తెలుగునాట ఆమెకు చెరగని స్ధానాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో సమగ్ర స్త్రీవాద కవితా సంకలనం 'నీలిమేఘాలు'. తెలుగులో తొలి స్త్రీవాద సిద్ధాంత గ్రంథం 'మాకు గోడలు లేవు' ఓల్గా సంపాదకత్వంలో వచ్చాయి. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిర్మించిన స్త్రీల గురించిన పుస్తకం 'మహిళా వరణం'కు ఓల్గా సహసంపాదకులు.
సాధారణంఆ స్త్రీలకు ప్రవేశం దొరకని తెలుగు సినిమా రంగంలో ఆమె పలు సినిమాలకు కథ, మాటలు, పాటలు, సహ దర్శకత్వం అందించారు. సంకలనకర్తగా, సంపాదకురాలుగా అనేక ప్రామాణికమైన రచనలను తీసుకొని వచ్చిన ఓల్గా ప్రస్తుతం పూర్తికాలం స్త్రీవాద కార్యకర్తగా అస్మితలో పని చేస్తున్నారు.