ప్రతివారం పాఠకులకు కాలస్పృహ కలిగించడమే ఈ శీర్షిక సాధించిన విజయం. పారిజాతపూల పరిమళ సున్నితానికి, వాటి ఆకుల గరుకుతనానికి మధ్య సమన్వయాన్ని అనువదించి చెప్పడమే ఈ అక్షరాల గిరాకీకి కారణం. ఈ పొత్తం నిండా రచయిత బాల్యం నుండి దాచుకున్న పొన్న పూల దండలను గురించిన కబుర్లను చెపుతారు. అది నోస్టాల్జియా కాకపోవడమే గొప్ప విచిత్రం. తను చుదువుకున్న పుస్తకాలు, తను నడిచిన దారులు, తనకి స్పూర్తినిచ్చిన మనుషులు, తనని తీర్చిదిద్దిన గురువులు, తనని కదిలించే స్నేహాలు, అన్నింటికి మించి తనని తాను మర్చిపోయే నింగి నేలా సామ్రాజ్యం, కొండలు, కూనలు, కొండ మామిడి చెట్లు, హఠాత్తుగా కురిసే వానలు చదివే పాఠకుడిని కదిలిస్తాయి. ఇది చెప్పడానికి తన వ్యక్తిగత అనుభవాలే అయినా... చదివిన ప్రతి వ్యక్తి తనదిగా భావించే సార్వజనీన స్వభావాన్ని కలిగి ఉండడమే ఈ రచన విశిష్టతగా మనకు అర్థమవుతుంది. ఆమె చెప్పే ఆలోచనలోని గాడత, స్వచ్ఛత, నిపుణత 'ఇలా' వ్యక్తి అనుభవాలు జాతి అనుభవాలుగా మారె స్వభావ లక్షణాలని పుణికి పుచ్చుకుంటాయి.

ఇలా సాగే జీవన వేణువు నిండా అద్భుతమైన సంగీతంతోపాటు, జీవితంలో ఎదిగే సారమూ ఇమిడి ఉంటుంది. నిరాశలోంచి ఆశని, ఓటమిలోంచి గెలుపుని, అలసటలోంచి ఉత్సాహాన్ని దొరకపుచ్చు కోవడానికి మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్‌లకి వెళ్ళక్కర్లేదని, ఒక్కసారి మనకుని, శరీరాన్ని మనచుట్టూ ఉన్న ఆకుపచ్చిటి దక్షిణ గాలులకు కట్టేస్తే మనం ఎంత శుభ్రపడిపోతామో చెప్పే గొప్ప అక్షరాకృతి ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good