మనిషిలో జంతుగుణాలకు కొదవలేదు. వాటి ఉత్తమ గుణాలే అబ్బలేదు (100) అన్నదే ఈ నూనింటికీ అంతస్సూత్రం. గుణం లేని జీవం అందమైన శవం (85) అని తీర్మానించినా, నేనెందుకు చచ్చిపోయానో నాకు తెలీదు (78) అని కరుణరసం చిందిచంఇనా, అంగట్లో అన్నీ ఉన్నా ముంగిట్లో సుఖం మాత్రం సున్నా (73) అని కొత్తసామెతను కల్పించినా, పాపం చేసిన వాడు పదిలం ప్రజలు మాత్రం శిధిలం (71) అని అంత్యానుప్రాసతో పొడిచినా, మనిషిగా పుట్టడం కన్నా మానుగా పుడితే ఎంత బావున్నో (68) అనీ, మంచితనములేని మాటకన్నా మంచికోరే మూగతనము మిన్న (53) అనీ, ప్రకృతి మాతను ఆసరాగా చేసుకొని అలంకారికంగా మనల్ని నిందించినా, బతకడం కోసం జీవించడం మర్చిపోతున్నాం (45) అంటూ సాదాసీదాగా ఆలోచనల్ని మధించినా, ఇలా ఏ కవితను తడిమినా అంతటా అంతస్సూత్రం ఒక్కటే! మనిషిలో జంతు లక్షణాలు వదిలించి మంచి లక్షణాలను పెంపొందిచాలి అన్నదే!

జననం వికసించిన పుష్పం - మరణం విడివడిన ఫలం (92) మాటలో కరుకుదనం - మనుగడకు చెరుపుదనం (33)... ఇలాంటి పంక్తుల్లో ఒక ఉపనిషత్కవి, ఒక శంకరాచార్యుడు, ఒక భర్తృహరి చటుక్కున స్ఫురిస్తారు. వీరి పఠన శీలానికి నిదర్శనంగా నిలుస్తారు.

Pages : 211

Write a review

Note: HTML is not translated!
Bad           Good