విశాలాంధ్ర దినపత్రికకు దాదాఉ 28 ఏళ్లు సంపాదకుడిగా ఉన్న చక్రవర్తుల రాఘవాచారి ఈ కాలంలో కొన్ని వేల సంపాదకీయాలు రాసి ఉంటారు. సంపాదకీయాలు విధిగా సంపాదకుడే రాయవలసిన అగత్యం లేదు. అందువల్ల అడపాదడపా ఇతరులూ రాయవచ్చు. కానీ సంపాదకీయాలు రాసే బాధ్యత చాలావరకు రాఘవాచారే తీసుకున్నారు. రాఘవాచారి సంపాదకీయాలు, ఇతర రచనలు ఆయన జీవిత కాలంలో వెలువడలేదు. వాటిని ప్రచురించడం ఆయనకు అంతగా ఇష్టం ఉండేది కాదు. ఆయన మరణించి ఏడాది కావస్తోంది. రాఘవాచారి మరణం తరవాత ఏర్పడిన ట్రస్ట్‌ ఆయన రచనలన్నింటినీ సంకలితం చేసి ప్రచురించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి సంపుటి వెలువడుతోంది. ఇందులో సాహిత్యం, భాష, సంగీతం, సినిమా రంగం, సాహితీవేత్తలు - ఇలా ప్రధానంగా సాంస్కృతిక రంగంతో ముడిపడిన అంశాలకు సంబంధించిన కొన్ని సంపాదకీయాలను ఏర్చి కూర్చి ప్రచురించారు.
పేజీలు : 266

Write a review

Note: HTML is not translated!
Bad           Good