ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో బంకించంద్ర చటర్జీ (1838-94) ప్రధమగణ్యుడు. అరవిందుడాయనను భౄరతీయ ఋషిపరంపరలో చేర్చి నివాళి ఘటించాడు. ఆయన శైలి, కళాత్మకత, సృజనాత్మకతలతో సాటిరాగల రచయిత వంగ సాహిత్యంలో ఆయన తరువాత లేరు అని వంగ సాహిత్య విమర్శకులన్నారు. మానవ జీవిత స్వభావ చిత్రణలో ఆయన ఆదర్శవాది. అయినా పాత్రలు జీవ చైతన్యంతో పాఠకులను ఆకర్షిస్తాయి. స్వాతంత్య్రోద్యమ సమరంలో సమస్త భారతీయ భాషలను ఆయన ఆనందమఠం ఆకర్షించింది. ఉత్తేజపరచింది. సమస్త భారతీయ భాషలలోకి ఈ నవల అనువాదం పొందింది. భారతీయ సాహిత్యంలో నవలా ప్రక్రియకు ఆద్య ప్రవర్తకుడు బంకించంద్రుడు. ఇంగ్లీషువారు నెలకొల్పిన విశ్వవిద్యాలయాల నుంచి తొలి పట్టభద్రు డాయన. బ్రిటీష్‌ పాలనలో గొప్ప ¬దా గల ఉద్యోగాలు చేశాడు. అయినా తన స్వాతంత్య్రాన్ని వదులుకోలేదు.
నాలుగు దశాబ్ధాలపాటు భారతీయ స్వాతంత్య్రోద్యమ సమర భేరిలా నినదించింది ఆయన వందేమాతరగీతం. సృజనాత్మక రచయితే కాక పురా భారతీయ విజ్ఞాన సంస్కృతి కోవిదుడు బంకించంద్ర చటర్జీ. బెంగాలీ సాహిత్య వచన శైలీ నిర్మాత. ఆధునిక భారతీయ సాహిత్యంలో, సమాజ సంఘటనోద్యమంలో, స్వాతంత్య్ర సమరంలో బంకించంద్రుడి పేరు చిరస్మరణీయమైనది. తెలుగులో ఆయన ఆనందమఠం ఒక శతాబ్ది కాలంలో పదిసార్లు అనువాదం పొందింది. భారతీయ భాషలన్నిటా పరిగణిస్తే ఆ సంఖ్య శతాధికం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good