ఇది రెండు వర్గాల సమాజం. పాలించేవాళ్లు తమ వర్గ ప్రయోజనాల కోసమే ఈ సమాజాన్ని ఇలా నిర్మించారని నేను నమ్ముతున్నాను. దీని ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణమంతా వీళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి కళలు, కావ్యాలు, ఆధ్యాత్మిక భావాలు ఆ నేపథ్యంతో సృష్టించుకున్నవే! కాలానుగుణంగా ప్రక్షిప్తాల రూపంలో వారికి అనుకూలమైన మార్పులు, చేర్పులు చేస్తూనే వచ్చారు.

విశ్వ నిర్మాణం గురించి నేను మాట్లాడడం లేదు. అదేమిటో తెలుసుకోవడానికి 'సైన్సు' ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. కాని, మానవసమాజ నిర్మాణం ఎలా జరిగిందో మనకు తెలుసు. 'ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం' గురించే మనం మాట్లాడుకోవాలి. 'చారిత్రక విభాత సంధ్యల మానవకథ వికాసం' గురించే మనం తెలుసుకోవాలి.

'కులం' జనాన్ని విడగొడితే 'మతం' పరలోకాల్లో తిప్పింది. దేవుడి 'కల్పన'తో కొంతకాలం భయభక్తులు నేర్పిన మాట నిజమే అయినా 'సత్యం' ఎప్పటికైనా తెలియవలసిందే! వైజ్ఞానిక సమాజం కళ్ళు తెరిచే కొద్దీ మూఢవిశ్వాసాలు మటుమాయం కాక తప్పదు. దేవుడే అన్నీ చూసుకుంటాడులే అన్న భావజాలం మారాలి. ఆ స్థానంలో 'మనిషి' రావాలి.

- తమ్మినేని అక్కిరాజు

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good