అక్కిరాజుకు ఈ దోపిడీవ్యవస్థమీద కసి, ధనికులు-పేదలుగా విభజనకు గురై పేద ప్రజలను దోపిడీ-పీడనలకు గురిచేసే వర్గాలంటే అంతులేని ఆగ్రహం. కులాలపేరిట ఉచ్ఛ-నీచాలను' సృష్టించేవారంటే చెప్పలేని కోపం. విద్య, విజ్ఞానం, శాస్త్రసాంకేతికపరిజ్ఞానం ఎంత పెరుగుతున్నా మనదేశం ఇంకా ఇంకా మూఢవిశ్వాసాల ఊబిలో కూరుకుపోతూండటాన్ని అక్కిరాజు కలం అడుగడుగునా అసహ్యించుకుంటోంది. మతాల పేరుతో మారణ హోమాలు సృష్టించే వారిపై అక్కిరాజు కలం నిప్పులుకక్కుతోంది. బానిస మనస్తత్వాల మధ్యతరగతి వర్గాలపై జాలితో కూడిన విమర్శ అక్కిరాజు రచనల్లో కనిపిస్తుంది. ప్రజలకోసం తమ జీవితాలను తృణప్రాయంగా ఎంచి త్యాగాలకు సిద్ధపడిన, త్యాగం చేసిన వారిపట్ల ఎంతో ప్రేమ - అభిమానం కురిపిస్తుంది.

    ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలను 'స్కెచ్‌'ల రూపంలో నమోదు చేయటం అక్కిరాజు శిల్పకళా వైవిధ్యం. ప్రతి కథానికా పాఠకుడిని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. విభిన్న కోణాలతో సామాజిక వాస్తవాలను అక్షరబద్ధం చేసిన అక్కిరాజు 'కథలు' పాఠకుల్ని పట్టి కుదుపుతాయి. మీ సంగతేమిటి? అని నిలేస్తాయి. నొప్పించ తానొవ్వక తప్పించుకు తిరిగే వారిని బొడ్లో చెయ్యేసి నిలేస్తాయి. అత్యంత సాత్వికునిగా కనిపించే అక్కిరాజులో ఎంతటి బడబాగ్ని దాగివుందో ఈ కథలు తేటతెల్లంచేస్తాయి. - జనసాహితి, ఆంధ్రప్రదేశ్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good