అద్దె ఇంటి అగచాట్లను వివరిస్తూ ఎన్నో కథలు, నాటికలు వచ్చాయి. ఇవి ఎక్కువగా హాస్యధోరణిలో కొనసాగాయి. అలా కాకుండా అందులోంచి ఒక సీరియస్‌ అంశాన్ని తీసుకుని ఆకెళ్ళ రాసిన నాటకం ''మీ ఇల్లెక్కడ?''. 

''కొత్త నాయకుడు'' అనే నాటకంలో మంత్రిగా పనిచేస్తున్న ఆదినారాయణ తరతరాలకు సరిపోయేంతగా సంపాదించినా, ఇంకా ఆశలు చావని నాయకుడు. డబ్బుకోసం ఏం చేసినా తప్పులేదని విశ్వసిస్తాడు. వాళ్ళ పెద్దబ్బాయి - పెద్ద కోడలు కార్పోరేన విద్యారంగాన్ని, చిన్నబ్బాయి - చిన్న కోడలు కార్పోరేట్‌ వైద్యరంగాన్ని శాసిస్తుంటారు. కథ కొన్ని మలుపులు తిరిగిన తర్వాత ఆదినారాయణ అందర్నీ పోలీసులకి అప్పగించి, తాను లొంగిపోతాడు. ఏ కల్మషం లేని తన మనవడ్ని, తన రాజకీయ వారసుడిగా తయారు చేయమని చిన్న కోడలుకు, బావమరిదికి అప్పగిస్తాడు.

''ఋషి'' నాటకంలో, అవసానదశలో వున్న తండికిచ్చిన మాట కోసం రాఘవ బాల్యం నుండే కష్టపడి, వ్యవసాయం చేసి, తన ఇద్దరు సవతి తమ్ముళ్ళను బాగా చదివించి, ప్రయోజకులను చేస్తాడు. 

ఇంకా ఈ సంపుటిలో పరుగు, కలనేత, పెద్దలూ-జాగ్రత్త, అంజలి, మమత హాస్పిటల్స్‌, బొమ్మా-బొరుసు అనే నాటకాలు ఉన్నాయి.

పేజీలు : 351

Write a review

Note: HTML is not translated!
Bad           Good