అతడు - అతులిత శేముషీ దురంధరుడు. శౌర్య సాహసాల్లో మేరునగధీరుడు. రాజనీతిలో యుద్ధతంత్రంలో చాణక్యసముడు. అఖండ భారతావనిని 'దర్శించి''న మొదటి ముస్లిం.

అందుకే అశేష భారతావని జేజులు పలికింది. మాన్‌సింగ్‌ వంటి మానవీయుడు తనవాడైనాడు. స్వపర బేధం రాచకార్యాల్లో లేదు. మత కార్యాల్లో అభిమతాల్లో అందర్నీ ఒక త్రాటిపైకి తెచ్చి మహమ్మదీయ సామ్రాజ్యానికి వజ్రపీఠాన్ని ఏర్పాటు చేసిన దీర్గదృష్టి - అతడే అక్బర్‌.

చదువురానివాడైనా విజ్ఞానఖని

చవ్రర్తియైనా దయాసాగరుడు.

చారిత్రక నవలా చక్రవర్తి ప్రసాద్‌ కలం నుండి వెలువడిన ఈ సరిక్రొత్త 'అక్బర్‌' నాల్గు శతాబ్దాలనాటి దృశ్యాలను ప్రత్యక్షంగా చూపి మనోనేత్రంలో నిలచేట్టు చేస్తుంది.

ప్రతి భారతీయుడు తప్పక చదివి తీరవలసిన నవల ''అక్బర్‌''.

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good