మహాభారతం భారతదేశంలో ఒక గొప్ప ఇతిహాసంగా చాలాకాలంగా నిలిచి ఉంది. కురుక్షేత్రంలో విజేతల దృష్టికోణంనుంచి చెప్పబడిన 'జయ' పాండవుల కథ అయితే, 'అజేయుడు' అపరాజితులైన కౌరవుల గాథ. వారిలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చంపబడతారు.

భరతఖండంలోని అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యం నడిబొడ్డులో విప్లవం రాజుకుంటూ ఉంది. కురువంశానికి పెద్దదిక్కు భీష్ముడు తన హస్తినపుర సామ్రాజ్యంలో ఐకమత్యాన్ని నిలిపి వుంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. 

సింహాసనాన్ని అధిష్టించినది అంధ మహారాజు ధృతరాష్ట్రుడు. అన్యదేశస్థురాలైన ఆయన రాణి గాంధారి. సింహాసనం నీడలో వితంతువైన రాణి కుంతి నిలబడి ఉంది. అందరూ ఆమోదించిన తన జ్యేష్ఠ కుమారుణ్ణి హస్తినాపురానికి రాజుని చెయ్యాలన్నది ఆమె ఆకాంక్ష.

యుద్ధంలో పరాజితులైనవారి ధృక్కోణం నుంచి మహాభారతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ 'అజయ'. దుర్యోధన అనే మాటకి అపరాజితుడు అనే అర్థం కూడా ఉంది. ఇంకోలా చెప్పాలంటే, అతను 'అజయ' (అజేయుడు). అతని అసలు పేరు సుయోధనుడే అయినప్పటికీ పాండవులు అతన్ని అవమానించేందుకు 'దు:' అనే ఉపసర్గని తగిలించి 'అధికారాన్నీ, ఆయుధాలనీ ప్రయోగించటం చేతకాని వాడు' అనే పెడర్థాన్ని సృష్టించారు. దుర్యోధనుడి కథలో కర్ణుడు, అశ్వత్థామ, ఏకలవ్యుడు, భీష్ముడు, ద్రోణుడు, శకునిలాంటి ఎందరి కథలో అల్లుకుపోయి కనిపిస్తాయి. వీళ్లందరూ పరాజితులు, అవమానానికి గురైనవారు, అణచివేతకి గురైనవారు. దేవతల సాయం కోరకుండా పోరాడినవాల్లు. తమ ఉద్దేశం న్యాయమైనదేనని నమ్మినవారు. ఉక్కపోతతో నిండిన ఒకానొక మధ్యాన్నంవేళ, పొరువళి గ్రామంలోని పచ్చని వరిపొలాల గుండా సుయోధనుడి గౌరవార్థం ఊరేగింపు వెళ్తున్నప్పుడు, తన సరళమైన ప్రశ్నతో నా నోరు మూయించిన ఆ గ్రామస్థుడికి నేను ఆలస్యంగా ఇస్తున్న సమాధానమే ఈ 'అజయ' కావచ్చు. మా ప్రభువు దుర్యోధనుడు నిజంగానే దుర్మార్గుడైతే, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కృష్ణుడి పూర్తి సైన్యం, ఆయన పక్షాన ఎందుకు యుద్ధం చేసినట్టు?

Pages : 400

Write a review

Note: HTML is not translated!
Bad           Good