ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలు, భాష అన్నీ కలగలసి తెలుగు సంస్కృతి రూపొందింది. తెలుగు వంటకాల ప్రాచీనతను, వాటిలోని ఆరోగ్య మూలాలను నిరూపించేందుకు పరిశోధకులకు కావల్సిన ముడి సరుకును తట్టలకెత్తి తేవడానికి ఈ పుస్తకాన్ని ఉద్దేశిస్తున్నాను. ఇది తెలుగు ప్రజల ఆహార సంస్కృతినీ, ఆరోగ్య మూలాలను సమన్వయం చేసే ఒక ప్రయత్నం.
మన ఆహార సంస్కృతిని కాపాడుకోవటం అంటే, మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవటమేననే సందేశాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. తెలిసిగానీ, తెలియకగానీ ఆహార విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు అనేక దీర్ఘ వ్యాధులకు కేన్సర్లాంటి చికిత్స లేని ఎన్నో వ్యాధులకు దారితీస్తున్నాయో ఒక వైద్యుడిగా నిర్మొహమాటంగా చెప్పవలసి వచ్చింది. సామాన్య పాఠకులకు బాగా నాటుకునేలా నొక్కి చెప్పటం కూడా జరిగింది. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని అగౌరవపరిచే రీతిలో మన ఆహారపు అలవాట్లు దారి తప్పుతున్నప్పుడు ముందుగా మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం కదా! తెలుగు భాషా సంస్కృతులను అభిమానించే ప్రతి ఒక్కరుమన ఆహారంలోని తెలుగుదనాన్ని కాపాడుకోవటానికి కదిలిరావాలని నా ఆకాంక్ష! ఆహ్వానం!!
- డా॥ జి. వి. పూర్ణచందు

Write a review

Note: HTML is not translated!
Bad           Good