దగ్గుమాటి పద్మాకర్‌ 1993 నుంచి 2018 దాకా దాదాపు పాతికేళ్ళ కాలంలో రాసిన 17 కథలు ఇవి. ఇప్పటి కథకులు ఏడాదికో, రెండేళ్ళకో ఒక కథాసంపుటం వెలువరిస్తున్న కాలంలో ఒక కథకుడు ఇన్నేళ్ళ పాటు కథాసంపుటం వెలువరించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతకన్నా ఆశ్చర్యం రాశిపరంగా కూడా కథకుడు పుంఖానుపుంఖంగా రాయకపోవడం. పదిహేను కథలంటే కనీసం ఏడాదికి ఒక కథ కూడా కాదు. జీవితాన్ని పైపైన కాకుండా, లోతుగా అనుభవంలోకి తెచ్చుకుని, ఆ అనుభవాల్ని ధ్యానించి వాటిమీంచి తనదే అయిన ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకునే కథకుడు మాత్రమే ఇంత నిదానంగానూ, ఇంత మితంగానూ రాయగలుగుతాడు. ఇటువంటి కథకుడు చెప్పే ప్రతి ఒక్క కథా ఎంతో భావగర్భితంగానూ, మరెంతో విలువైందిగానూ ఉండటంలో ఆశ్చర్యంలో లేదు.

పేజీలు : 154

Write a review

Note: HTML is not translated!
Bad           Good