సోషలిజం గురించి అనేక మంది మేధావులు, మానవతావాదులు గతంలో కలలుగనేవారు. కానీ మొట్టమొదటిసారిగా సోషలిజానికి ఒక శాస్త్రీయ రూపం ఇచ్చి, పెట్టుబడిదారీ విధానం స్థానంలో సోషలిజం రావడం అనివార్యమని చెప్పిన మహా మేధావి కారల్‌మార్క్స్‌. పెట్టుబడిదారీ విధానంలో ఆవిర్భవించిన కార్మికవర్గం పెట్టుబడిదారీ విధానాన్ని అంతమొందించి, సోషలిజాన్ని సాధిస్తుందని స్పష్టం చేసిన దార్శినికుడాయన.

మార్స్సిజాన్ని ఆయుధంగా చేసుకుని అనేక దేశాల్లో దోపిడీని కార్మిక వర్గం అంతం చేసింది. సోషలిస్టు విప్లవాలు సాధించింది. గత శతాబ్దం చివరిలో సోషలిజానికి తగిలిన ఎదురుదెబ్బలతో మార్క్సిజం పని అయిపోయిందని, సోషలిజం కొరగానిదని పెట్టుబడిదారీ పండితులు ప్రచారం అందుకున్నారు. కానీ 2008లో అమెరికాలో ప్రారంభమై, ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మార్చివేసింది. పెట్టుబడిదారీ విధానంలోని జబ్బులకు శాశ్వత చికిత్సలేమీ లేవని, దాని స్థానంలో సోషలిజం నిర్మించడమే పరిష్కారమని మార్క్స్‌ చెప్పిన సిద్ధాంతం మళ్ళీ ఊపిరి పోసుకుని ప్రపంచ వ్యాపితంగా ఉద్యమాలకు ఊపునిస్తూ ఉన్నది. అందుకే మళ్లీ సోషలిజం పట్ల, మార్క్సిజం పట్ల ఆసక్తి ప్రారంభమైంది.

మార్క్స్‌ చెప్పిన విషయాలను పరిశీలిస్తే ఆయన ఆలోచనలు ఎంత సమకాలీన ప్రాధాన్యత కలిగి ఉన్నాయో విదితమవుతుంది. ఆ విషయాలన్నీ ఈ చిన్న పుస్తకంలో సంగ్రహపరచబడ్డాయి

పేజీలు : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good