'అదృష్టం' ఈ మాట ప్రపంచంలోవున్న అన్ని భాషలలో ఒక అద్భుతమైన పదం. ఈ పదానికి ఒక నిర్వచనం అనేది లేదు. అనుభవజ్ఞులు తమ అనుభవాలతో ఈ పదానికి రకరకాలుగా నిర్వచనం తెలిపారు.
ఏది ఏమైనా మనకు కనిపించె 'అదృష్టం' అంటే వృత్తికి,  ప్రవృత్తికి సంబంధంలేని, ఎప్పుడూ ఊహించని, మన స్ధితికి మించిన అత్యున్నత అవకాశాలు రావడమే అదృష్టం అనుకోవచ్చు.
అదృష్టం అందరికీ ఏదో ఒక కాలంలో వస్తుంది. సాధారణ ఎదుగుదల అయితే దానిని మంచిరోజులు, కలిసిరావడం అంటాము. అదే ఊహించనంత అభివృద్ధి అయితే దానిని అదృష్టం అనీ, అది పొందిన వాడిని అదృష్టవంతుడు అంటాం. కనుక అదృష్టం ప్రతివారిని ఏదో ఒకస్ధాయిలో వరిస్తునే ఉంటుంది.
అలా అదృష్టం ఎవరిని ఎలా వరించింది, ఏవి అదృష్ట చిహ్నాలు మరియు అదృష్టం కోసం అన్ని మతాలు, జాతులు వారు ఆచరించే ఆచారాలు ఏమిటీ? ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ పుస్తకం మీకు అందిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good