గొప్ప రచయిత చేతుల్లో అది గొప్ప కథానికగా ఎలా మారుతుందో చూడాలనిపించింది. ఆయన పెన్ నుంచి 'సిద్ధార్థ' జాలువారింది. జ్యోతి దీపావళి సంచికలో ప్రచురించిన దానికి బంగారు ఉంగరాన్ని ప్రజెంట్ చేశారు. అప్పుడే అర్థమైంది కథానికకి ఏమి చెబుతున్నామన్న దానికన్నా, ఎలా చెబుతున్నామన్నదని ముఖ్యమని! సీనియర్ రచయితల నుంచి ఇలాంటివి తెలుసుకోవచ్చని. అలా ఆదివిష్ణుగారు గురువుగారయ్యారు. బందరులో నేను ఆయన నుంచి విహారి, యర్రంశెట్టి శాయిగారల నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను కథానికలు రాయడం గురించి!
ఈ కథానికలు చదివితే మీకే అర్థమవుతుంది. ఆరోజుల్లో రచయితగా ఆయన్ని మేమంతా అంతగా ఎందుకు అభిమానించేవాళ్ళమా అని! రచయితగా ఆదివిష్ణుగారి ప్రత్యేకత ఆదివిష్ణు గారిదే! ఆ విషయాన్ని చెప్పడనికి నేనెవర్ని? అందుకే చదవండి.. ఆయన కథానికలే చెబుతాయి, అవి ఎంత ప్రత్యేకమైనవో. చిన్న చిన్న వాక్యాలతో కథని ఎలా పరుగెత్తించవచ్చో, కథని ఆసక్తితో చదివించేలా ఎలా మలచవచ్చో....
- వేదగిరి రాంబాబు

Write a review

Note: HTML is not translated!
Bad           Good