పురాణ కథనాన్ని ఆధునిక దృష్టితో నిర్వచించిన నవల అదిగో ద్వారక. కృష్ణుడి అష్ట భార్యలలో ఒకరయిన జాంబవతి, ఆమె పుత్రుడు సాంబుడి కథే ఈ నవల. వీరు గిరిజనులనే పాత విషయాన్ని సరికొత్తగా చెప్పడంతో కథ తాలుకా కోణమే మారిపోయింది. తమ అస్తిత్వాన్ని తమ సొంత గొంతులతో వినిపిస్తున్న నేపథ్యంలో అంతటి శక్తిని ఇంకా సంపాదించుకోలేని గిరిజనుల కోసం, వారి అస్తిత్వ మూలాలను తవ్వి తలకెత్తుకుని ప్రపంచం ముందుకు తేవాలనే ఆరాటమే ఈ నవలా సారాంశం.

మన పురాణాలను మనే పునర్‌ నిర్వచించుకుని, ఇతిహాసపు చీకటి కోనాలనుంచి వాటిని వీక్షించాలి. పాలకులవైపు నుంచి కాకుండా పీడితులవైపు నుంచి వాటిని దర్శించాలి. యుగయుగాలుగా ఉపేక్షితులకు జరిగిన అన్యాయాలపై శోధన జరపాలి, పరిశోధన సాగించాలి. పాత సజీవ చరితలను ఇప్పటి తరానికి నవ్య రీతిలో అందివ్వాలి. ఈ నవలలో డా|| చింతకింది శ్రీనివాసరావు చేసిందిదే.

Pages : 188

Write a review

Note: HTML is not translated!
Bad           Good