Rs.70.00
In Stock
-
+
అధ్యయనం, ఆచరణ, సిద్ధాంతం - వీటన్నింటికి పరస్పర సంబంధం ఉంది. ఈ పుస్తక రచయిత, సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మిలిటెంట్ నేతగా పేరుంది. ఇదే సమయంలో ఆయన అధ్యయనానికీ సమాన ప్రాధాన్యతనిచ్చేవ్యక్తి. తాను స్వయంగా అధ్యయనం చేయడమే కాకుండా, ఖమ్మం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అధ్యయనాన్ని ఒక సమిష్టి కృషిగా, పార్టీ నేతలు, కార్యకర్తల్లో పెంపొందించిన వ్యక్తి ఆయన. సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సైద్ధాంతిక మాసపత్రిక 'మార్క్సిస్టు'లో గత కొన్నేళ్ళుగా రాసిన వ్యాసాలు ఇవి. కమ్యూనిస్టు కార్యకర్తలకే కాకుండా, ఒక క్రమపద్ధతిలో అధ్యయనాన్ని పెంపొందించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం సహాయపడుతుంది.