బ్రహ్మాండపురాణం ఉత్తరఖండంలో శివమహాదేవుడు పార్వతికి చేసిన బోధగా చెప్పబడిన ఆధ్యాత్మ రామాయణ౦ గురువాక్కు, ఆది గురువైన శివుని వాక్కు, అందువల్లనే అది తారకము అనగ తరింపచేయునది. మనలో దైన్యాన్ని, అపవిత్రతను, తాపాన్ని ఒకేసారి హరి౦చగలిగే ఆధ్యాత్మరామాయణం కల్పవృక్షం కన్న, గంగకన్న, చంద్రునికన్న గొప్పది. ఇది గురుతత్త్వాన్ని చెప్తూ ఆ తత్త్వంలో లయమయ్యే పధ్ధతి సూచిస్తుంది.
ఆధ్యాత్మరామాయణాన్ని ప్రతినిత్యం నియమనిష్ఠలు ఉన్నా లేకపోయినా భగవంతుని యందు భక్తితో పారాయణ చేసినట్లయితే అన్ని దోషాలూ పోతాయి. ఆధ్యాత్మరామాయణ పారాయణ వల్ల ఆరోగ్యం, ఇష్టకామనలు, అన్ని కలుగుతాయి. వీటిని మించి సద్గురువు ఆశీస్సులు దొరుకుతాయి. ఒక యోగం, మంత్రం, వేదం, ఉపనిషత్తు ఇవ్వలేనిది ఈ ఆధ్యాత్మరామాయణ౦ ఇస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి, సుజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని కలిగించడానికి రాచబాట ఈ ఆధ్యాత్మరామాయణం. కలియుగంలో దీన్ని మించిన మంత్రం, వ్రతం, నియమంలేవు. అన్ని తత్త్వాలసారం, అన్ని వేదాల లక్ష్యం, అన్ని ఉపనిషత్తులలోని బోధ దీనిలో ఉన్నది. సామాన్య వ్యక్తులకు ఆధ్యాత్మ రామాయణ పారాయణ భాగవత్గీతాపారాయణ కన్నా ఎంతో సులభమైనది, సూక్ష్మమైన విషయాలతో అనుష్టానంతో కూడుకొన్నది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good