తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాలపై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథా సంకలనం 'అధూరె'. తాజాదనంతో..సులువైన నడకతో..ఉత్కంఠను కొనసాగిస్తూ మూస పద్దతిని బద్దలు చేస్తూ, విభిన్నంగా కనిపించడమే ఈ కథల లక్షణం. ఈ పుస్తకం చదివాక ఈ కథల్లోని ముస్లిం స్త్రీ పాత్రలు మనల్ని వెంటాడతాయి. దావత్‌లలో స్త్రీలను అఖరి బంతుల్లో కూర్చోబెట్టినట్టి నిర్ణయాలన్నింటిలోనూ వాళ్ళది ఆఖరి బంతే. ఇలాంటివెన్నో దృశ్యాలను కళ్ళముందుంచిన రచయిత సునిశిత ధృష్టిని మనం గమనించవచ్చు. ఆనాడు తెలుగు సాహిత్యంలో శ్రీపాద గుబాళింపజేసిన గులాబీ అత్తరులా... ఈకథలు ముస్లిం జీవితాల పరిమళాన్ని, పేదరికపు గోసను వ్యాపింపజేస్తున్నాయి. వీటిల్లో వ్యక్తమైన నిర్మలమైన మనసు మరెన్నో విశిష్టమైన కథల్ని వాగ్ధానం చేస్తున్నది... షాజహానా 

Write a review

Note: HTML is not translated!
Bad           Good