నేటి ఆధునిక విజ్ఞానం కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు సాగిపోతున్నది. ఈ రోజు వున్నా లేటెస్ట్ టెక్నాలజీ రేపటికి పాతదై పోతున్నది. ఈ ఆధునిక విజ్ఞానం వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొని వచ్చింది. శాస్త్రవేత్తల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు మరణమే తప్ప చికిత్సలేని వ్యాధులకు నేడు చికిత్స చాలా సులువుగా మారింది.అలాగే ఇప్పుడు నివారణే తప్ప చికిత్స లేని కొత్త వ్యాధులు పుట్టుకువచ్చి శాస్రజ్ఞలకు సవాల్ గా నిలిచాయి. ఇంటువంటి పరిస్థితిలో సామాన్య మానవునికి కూడా విద్యారంగంలో వచ్చే మార్పులు , ఆధునిక వైద్య వివరములు తెలుసుకోవలసిన అవసరము ఎంతైనా వున్నది. సామాన్యుని చెంత వైద్య విజ్ఞానం అందుబాటులో ఉంటేనే అందరికీ ఆరోగ్యం అనే నినాదం బలపడుతుంది. కొన్ని జబ్బులు కేవలం అజ్ఞానం వాల్ల , శుచి, శుబ్రత పాటించకపోవటం వాళ్ళ వస్తాయి. ఇవి అందరికీ తెలియ జేయాలనే ఉద్దేశ్యంతో ఆయా రంగాలనో నిష్టాతులు అయిన వైద్య నిపుణులు రాసినటువంటి అక్షర లక్షల విలువ జేసే వైద్య వ్యాసములు పుస్తక రూపంలోని తీసుకురావడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good