ఈనాడు మన దైనందిక జీవనంలో రోజు ఎక్కడో ఒకచోట మనకు కులంతో అవసరం కలుగుతుంది. ఒక స్కూల్‌ అడ్మిషన్‌ కావచ్చు, రేషన్‌ కార్డ్‌ కావచ్చు లేక మనకు అద్దె ఇల్లు కావలసి వచ్చినప్పుడు ఇంటి ఓనర్‌ నుండి సంధింపబడే ముఖ్యమైన ప్రశ్న. మీరేమిట్లు? అంటే, మీరు ఏ కులస్థులు. అదే ముస్లిం కులస్థులుగాని, సిక్కు సర్థార్‌ గాని వాళ్ళు మేము ముస్లింలం అని లేక సర్థార్‌జీలమని సమాధానం వస్తుంది. దాని మీద ఇతరత్రా సప్లమెంటరీ ప్రశ్నలు లేకుండా ఇస్తాము. లేక ఇల్లు అద్దెకు ఇవ్వమని చెప్తారు. ఎటుతిరిగి హిందూవైతేనే డైరెక్ట్‌గా నేను ఫలానా కులస్థుడనని జవాబు చెప్పవలసి వస్తుంది. కులం పేరు చెప్పకుండా నేను హిందువుని అని మనం అంటే మనల్ని పిచ్చివాళ్ళని చూసినట్టు చూసి ఏమిటా పిచ్చి సమాధానం! మీకు కులంలేదా? తెలియదా? అని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే 'హిందు మతస్థులకు'' కులం అనేది ఖచ్చితంగా ఉండవలసిందే. అది మీరు అడిగిన వారందరికి చెప్పవలసిందే. ఇక్కడ క్రిస్టియన్‌ల విషయానికి వస్తే ముస్లిం, సిక్కుల లాగా మేము క్రిస్టియన్స్‌ అంటే ఎవరు సంతృప్తి చెందరు. మరల మీరు మాల క్రిస్టియన్ల, మాదిగ క్రిస్టియన్ల అనే సప్లమెంటరీ ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు నిమ్నజాతి కులాలనుండి చాలామంది క్రైస్తవ మతం తీసుకున్నారనే ఒక బలమైన అభిప్రాయం సమాజంలో ఉంది కనుక. ఇంతకు చెప్పేదేమిటంటే మీరు హిందువుగా ఉన్నంతవరకు కాని, లేక క్రైస్తవ మతం తీసుకున్న మీ కులం సర్టిఫికెట్‌ జేబులో పెట్టుకుని మరీ తిరగవలసిందే! ఇక్కడ ఉన్న ఇంకొక మతలబేమిటంటే మీ కులం ఏదైనా మీకు షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌లకు ఇచ్చే రిజర్వేషను మీరు హిందువుగా వున్నంత వరకే చెల్లుబాటు అవుతుంది. మీరు మతం మారితే రిజర్వేషన్‌ హక్కులను కోల్పోతారు. కొన్ని రాష్ట్రాలలో ఇది బి.సి. గ్రూపులలో చేర్చారు. కాని మీ కులం మీతోనే ఉంటుంది. చెక్కు చెదరకుండా వుంటుంది. ఇక్కడ ఇంకొక మతలబు వుంది. అది ఏమిటంటే అదే షెడ్యూల్డ్‌ తెగలు అంటే ఎరుకల, యానాది, చెంచు, లంబాడ మొదలగునవి. వారు మతం మారినా కూడా వారికి ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్‌ సదుపాయాలకు ప్రమాదమేమి ఉండదు. మతం మారిన వాళ్ళకు కూడా ఆ సదుపాయం అందుతూనే ఉంటుంది. గమనించండి! మతం విషయంలో రాజ్యాంగం సమకూర్చిన సదుపాయం అమలులో అనుసరిస్తున్న జగ్లరి మరియు ధ్వంధ ప్రమాణాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మన మేధావులకు అర్థమైనది, జనాలకు అర్థంకానిదేమిటంటే ''మతం'' రిలిజియన్‌ అనేది ఆర్టికల్‌ - 25 ప్రకారం మన రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాధమిక హక్కు. ఒకవైపు మీ మతం మీ ఇష్టం అంటూనే ఇంకోవైపు హిందూ మతం వదిలినావంటే నీకు ఎలాంటి రిజర్వేషన్‌ సదుపాయాలు మీ కులస్థులకు అందుతున్నాయో వాటిని మీరు కోల్పోతారని హెచ్చరించడమే కాక అందులో పడి వుంటేనే కాని మీకు గాని మీ తరువాత మీ పిల్లలకు గాని ఈ సౌకర్యం వుండదు అని వార్నింగ్‌ ఇచ్చినట్లుగా వుంటుంది ఈ సదుపాయం. దీని గురించి ఎవరైనా అడిగితే పెద్దలిచ్చే సమాధానం ఛాయిస్‌ మీకే ఇచ్చాంకదా కావాలంటే తీసుకోండి లేకుంటే వదిలేయండి! ఒకవేళ మీరు వదులుకుని (రిజర్వేషన్‌ సదుపాయం) క్రైస్తవమా, లేక బుద్దిజమో తీసుకున్న మీ కులం మిమ్ముల్ని వెంటాడుతూనే వుంటుంది. ఇస్లాంలోకి మారితే ఈ కులం గొడవే ఉండదు. కాని ముస్లిం రాజులు పరిపాలిస్తున్న కాలంలో బలవంతంగానో లేక భయపెట్టే మార్చడం జరిగింది. కాని ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు కనుక ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం లేదు......

Write a review

Note: HTML is not translated!
Bad           Good