వివిధ కోణాలలో పలురకాల సమస్యలు కొత్తగా తలెత్తిన తర్వాత అందరికీ తెలిసివచ్చినదేమంటే ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప విద్య; అన్ని కళలలోనూ గొప్పకళ 'పిల్లల పెంపకం'. అరిస్టాటిల్‌ చెప్పిన పోలిక కూడా కొంతమేర కాలబ్రష్టత చెందింది. పిల్లల వ్యక్తిత్వాలను, భవిష్యత్తును కేవలం పెంపకం ద్వారా తీర్చిదిద్దడం కష్టసాధ్యమవుతోంది. పిల్లల మనసులు ఖాళీ పలకల మాదిరి ఉంటాయని, వాటి మీద ఏదైనా రాయవచ్చుననుకోవటం అర్థసత్యం. పెంపకం ప్రభావం 70 శాతానికి దిగిపోయింది. ఇదే ఈనాటి చాలామంది తల్లిదండ్రుల ఆందోళనకు కారణమవుతోంది. 70 శాతం పెంపకం ప్రభావంలోనైనా పిల్లలను సంరక్షించుకొని, సమాజంలోని సవాలక్ష కాలుష్యాల ప్రభావంలో పిల్లలు కొట్టుకుపోకుండా కాపాడుకోవాలి. అందునిమిత్తం  ఆయా మౌలికాంశాలను చర్చించేందుకు ఈ గ్రంథరచన తోడ్పడుతుంది. - శ్రీవాసవ్య

Pages : 246

Write a review

Note: HTML is not translated!
Bad           Good