తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాలపై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథా సంకలనం 'అధూరె'. తాజాదనంతో...సులువైన నడకతో... ఉత్కంఠను కొనసాగిస్తూ... మూస పద్ధతిని బద్దలు చేస్తూ... విభిన్నంగా కనిపించడమే ఈ కథల లక్షణం. ఈ పుస్తకం చదివాక ఈ కథల్లోని ముస్లిం స్త్రీ పాత్రలు మనల్ని వెంటాడుతాయి. దావత్‌లలో స్త్రీలను ఆఖరి బంతుల్లో కూర్చోబెట్టినట్లే నిర్ణయాలన్నింటిలోనూ వాళ్లది ఆఖరి బంతే. ఇలాంటివెన్నో దృశ్యాలను కళ్లముందుంచిన రచయిత సునిశిత దృష్టిని మనం గమనించవచ్చు. ఆనాడు తెలుగు సాహిత్యంలో శ్రీపాద గుబాళింపజేసిన గులాబీ అత్తరులా.. ఈ కథలు ముస్లిం జీవితాల పరిమళాన్ని, పేదరికపు గోసను వ్యాపింపజేస్తున్నాయి. వీటిల్లో వ్యక్తమైన నిర్మలమైన మనసు మరెన్నో విశిష్టమైన కథల్ని వాగ్దానం చేస్తున్నది.

పేజీలు :130

Write a review

Note: HTML is not translated!
Bad           Good