‘‘మైగాడ్..... స్టాప్.... స్టాప్ హిమ్!’’ అనరుస్తూ రివాల్వర్ తీసింది అధర్వణ.
వెనన ముందు ఆలోచించకుండా తన గన్స్ ప్రయోగించారు సెక్యూరిటీ వాళ్ళు.
కాని ఆశ్చర్యం-
దూసుకెళ్ళిన బుల్లెట్లన్నీ అతడి కోటును తాకి గవ్వల్లా దాలిపోతున్నాయి గాని, అతడ్ని ఏమీ చేయలేకపోతున్నాయి. అతడు మాత్రం సుడిగాలిలా పరుగుపెడుతూ వచ్చిన వేగంలోనే టెర్రస్ గోడమీదకు దూకి, అక్కడి నుంచి గాల్లోకి ఎగిరాడు.
ఎక్కడివాళ్ళక్కడ బొమ్మల్లా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని చూసారు.
అయిదు కాదు, పది కాదు, సుమారు యాభై అడుగుల దూరంలో ఉన్న కట్టడం టెర్రస్ మీదకు పక్షిలా ఎగురుకుంటూ వెళ్ళి వాలాడు అతడు.
అక్కడి టెర్రస్ నుంచి దిగువన మరో కట్టడం పైకి దూకాడు. అంతవరకే కన్పించాడతను. ఆ తర్వాత అతను చీకట్లలో ఎటు వెళ్ళిపోయిందీ కన్పించలేదు.
ఆ షాక్ నుంచి అంతా తేరుకునే లోపలే-
దూరంగా ఎక్కడో మోటార్ బైక్ స్టార్టయి వెళ్ళిపోతున్న శబ్దం విన్పించింది.
అది కలో, నిజమో కూడ ఎవరికీ అర్థంకాలేదు.
అంత కాంతివంతమైన మనిషిని ఎప్పుడూ చూళ్ళేదు సెక్యూరిటీ వాళ్ళు.
అతడ్ని బుల్లెట్లు కూడ ఏమీ చేయలేకపోవటం అధర్వణ కొత్తగా కనుగొన్న విషయం.
ఆ పరిస్థితి నుంచి ముందుగా తేరుకున్న సెక్యూరిటీ చీఫ్ అధర్వణ వంక భయంగా చూసాడు.
‘‘ఎవడు మేడమ్....? ఎవడు వాడు....? మనిషేనా?’’ అనడిగాడు.
‘‘నేనూ ఇప్పుడే చూస్తున్నాను. మనిషి కాకపోవచ్చు’’ అంది ఏమీ తెలినట్టుగా అధర్వణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good