ఐదు మిలియన్ల సంవత్సరాల నుంచీ మనుష్యులు ఈ భూమ్మీద జీవిస్తున్నారని అంచనా. మన మానవదేహమంతా అద్భుత యంత్రం ఈ సృష్టిలోనే లేదు. కనీస ఆరోగ్య నియమాలు పాటిస్తే మానవదేహం వందేళ్ళకుపైగా అద్భుతంగా పనిచేస్తుంది. అంతకంటే అద్భుతమైన విషయం ఏమిటంటే ఎటువంటి రోగాన్నయినా సరే మన దేహం నయం చేసుకోగలుగుతుంది. ఇంతటి అద్భుతమైన మన దేహాన్ని మనం వ్యసనాలతో, మూర్ఖమైన నిర్లక్షమైన జీవన విధానంతో శిధిలం చేసుకుని భయంకరమైన రోగాలకు ఆహుతి అవుతున్నాం.

ప్రకృతివైద్యం లేదా నాచురోపతికి సంబంధించి నిజమైన ఆద్యునిగా విన్సెన్జ్‌ ప్రీస్‌నిడ్జ్‌ను చెప్పుకోవాలి. ఆయన తన క్లీనిక్‌ను చిన్నగ్రామంలో పర్వతాల మధ్య ఏర్పాటు చేసి రోగాలకు వైద్యం చేసేవాడు. స్వతహాగా రైతు అయినప్పటికినీ ఆయన తన సునిశితమైన పరిశీలన, విచక్షణతో వైద్యం చేసేవాడు. ఆయన క్లీనిక్‌కు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచీ రోగులు వచ్చి ఆరోగ్యంగా తిరిగి వెళ్ళేవారు. చల్లటినీళ్ళ స్నానం ఏవిధంగా రోగాలు నయం అవుతాయో ప్రపంచానికి తెలియ చెప్పింది ఈ మహానుభావుడే. ఓ వ్యక్తి తన జీవితాన్ని ఫణంగా పెట్టి మంచి చేయాలని ప్రయత్నిస్తుంటే కడుపు మంటతో అడ్డపుల్లలు వేసేవాళ్ళు ఆ రోజుల్లోనూ వున్నారు కాబట్టి ప్రీస్‌నిడ్జ్‌ తప్పుడు వైద్యం చేస్తూ రోగులను మోసం చేస్తున్నాడని కొందరు మూర్ఖులు కోర్టుల్లో కేసులు వేసారు. న్యాయమూర్తులు ఆ కేసులు కొట్టి వేయటంతో ప్రీస్‌నిడ్జ్‌ పాపులారిటీ మరింత పెరిగింది.

సహనంగా, ప్రశాంతంగా వుంటే ఎంతటి దీర్ఘ రోగాలయినా నయం అవుతాయని ఆయన ప్రగాఢ నమ్మకం. జీవితవిధానం సక్రమంగా లేకపోయినా, చెడు అలవాట్లకు బానిసగా మారినా శరీరంలో మలినాలు, విషపదార్థాలు పేరుకుపోతాయి. ఆ కారణంగా శరీరం రోగాల పాలవుతుంది. అందుకే దీర్ఘరోగాల నుంచి కోలుకోవాలంటే ముందు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగు పర్చాలి. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా వుంటే శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఒకవేళ అనారోగ్యం ఎదురైనా సక్రమంగా దానితో పోరాడాలంటే రోగనిరోధక సరిగ్గా వుండాలి. కాబట్టి ప్రకృతివైద్యం ద్వారా రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆయన కృషి చేసేవాడు.

Pages : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good