అతనో సైంటిస్ట్‌...
అమెరికన్‌ నాసాలో గ్రహాంతర జీవులమీద పరిశోధించే ప్రతిభావంతుడైన సైంటిస్ట్‌...
'నోబెల్‌ ప్రైజ్‌' లక్ష్యంగా బ్రతుకుతున్న సైంటిస్ట్‌...
వారసత్వంగా వచ్చిన ఆస్ధులను అమ్మేయటానికి 'ఇండియా' వచ్చాడు...
తిరిగి అమెరికా వెళ్ళలేదు.
కుటుంబం, బంధువులు, ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ఆ 'పల్లెటూళ్ళో'నే వుండిపోయాడు.
నోబెల్‌ ప్రైజ్‌ కంటే గొప్ప లక్ష్యం ఆ పల్లెటూర్లో ఆయనకేం కనిపించింది?
జీవితం, మానవ సంబంధాలు, శరవేగంతో మారిపోతున్న ఈ ప్రపంచం తాలూకు 'మాయాజాలాన్ని' ఆవిష్కరించే నవల జీవితం మైనస్‌ ప్రేమ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good