అదే ఆకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్‌ కవిత్వం గ్రంథాల ద్వారా అనేక దేశాల అనువాద కవిత్వాన్నీ, సూపీ తత్త్వ సారాన్నీ, నోబెల్‌ కవుల కవిత్వజీవితాల్నీ క్రోడీకరించి తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించిన విశిష్ట కవి, అనువాదకుడు వై.ముకుంద రామారావు. స్వయంగా యేడు సంపుటాలు వెలువరించిన కవిగా కవిత్వ 'ఆల్కెమీ' రహస్యాన్ని యెరిగిన ముకుంద రామారావు అనువాదాలకు సైతం సృజనాత్మక శైలినీ సహజత్వశోభనీ అద్ద గలిగాడు - తనదైన ముద్రతో కవిత్వ ప్రేమికులకు ఆత్మబంధువు కాగలిగారు.

'పుత్తడికి పరిమళం పూసినట్టుండే వచనాన్ని సొంతం చేసుకున్న రామారావు యిప్పుడు 'అదే గాలి' ద్వారా ప్రపంచ దేశాల కవిత్వ చరిత్రతో మరోసారి పాఠకుల హృదయాన్ని స్పృశించి కొత్తలోకాలకరు ద్వారాలు తెరుస్తున్నారు. నూట ముప్ఫై దేశాలకు చెందిన రెండు వేల మంది కవుల్ని యీ గ్రంథం ద్వారా ఆయన పరిచయం చేస్తున్నారు. దాదాపు అయిదు వందల కవితల్ని అనుసరించి ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్నారు.

దేశం యేదైనా జాతి యేదైనా కవిత్వ భాష విశ్వజనీనమనీ, కవి వసుధైక కుటుంబీకుడనీ 'అదే గాలి' గ్రంథం మరోసారి నిరూపిస్తుంది.

Pages : 557

Write a review

Note: HTML is not translated!
Bad           Good