కథా రచనలోని రహస్యం ఒకటే! ముందు ఆ కథ, రచయితను ఆనందిపజెయ్యాలి. అలా కమలేంద్రనాథ్‌ తాను ఆనందించి, మనకు అందించినవే ఈ పుస్తకంలోని కథలన్నీ. ఈ కథలు చదివితే మీ గుండె లోతుల్లో ఎక్కడో ఓ చిన్న అలజడి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తప్పకుండా ప్రేమించేందుకు సిద్ధమవుతారు. వారానికి ఓ కథ చొప్పున సంవత్సరం పాటు యాభై రెండు చెత్త కథలు రాసి కష్టపడే కంటే ఆరు నెలలకి ఓ కథ చొప్పున ఏడాదికి రెండు మంచి కథలు రాసి, రచయితగా తాను సుఖపడి, పాఠకులుగా మనల్ని సుఖపెట్టిన కమలేంద్రనాథ్‌కి కృతజ్ఞతలు.

    - జగన్నాథ శర్మ

    ఎడిటర్‌, నవ్యవీక్లి

Write a review

Note: HTML is not translated!
Bad           Good