ఇరవయ్యవ శతాబ్దం తొలి అర్థభాగంలో లలిత కళావతంసులకూ, సాహితీ వేత్తలకూ ''బావ'' ''బాపిబావ'' పదాలకు నాట్యం నేర్పాడు. నాట్యానికి సంగీత మద్దాడు. చిత్రాలకు ప్రాణం పోశాడు. చరిత్రను అక్షరీకరించాడు. సాంఘికానికి అభ్యుదయ ఊర్పులందించాడు. అన్నింటా మానవత్వం ప్రజ్వలించాడు. ఒకే ఒక్కడు - అతడే అడివి బాపిరాజు.
సాహిత్యంలో 'నారాయణరావు'కు పర్యాయపదం అడివి బాపిరాజు. అంతటి ప్రసిద్ధిని సంపాదించిన సాంఘిక నవల సృజన 1934లో. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తెలుగులో నవలల పోటీ నిర్వహించింది. వచ్చిన నవలలో రెండు నవలలను ప్రథమ బహుమతికి అర్హమైనవిగా న్యాయనిర్ణేతలు భావించి బహుమతిని ఆ ఇద్దరు రచయితలకూ సమానంగా ప్రదానం చేశారు. విశ్వనాథ సత్యనారాయణగారి 'వేయిపడగలు', అడివి బాపిరాజుగారి 'నారాయణరావు' నవలలే అవి. ఇది 'నారాయణరావు' ఆవిర్భావ చరిత్ర. బాపిరాజు గారు మిగిలిన రచనలకన్నా వారి, సాంఘిక, చారిత్రక నవలలకే ప్రాధాన్యమిచ్చారు ఆనాటి పాఠకులు.
సాహిత్యంలో విశ్వనాథ సూర్యుడైతే బాపిరాజు చంద్రుడన్నది నాటి కొందరు సాహితీపరుల ఊహ. హిమాచల శిఖరాలవలె, గంగా యమునా నదులవలె శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్య స్రష్ట అడివి బాపిరాజు గారి నవల నారాయణరావును మీరు చదవబోతున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good