ఏనాటి కాంతవు! యుగయుగాలనుండి నీవు గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునా బ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈ నాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్నవి. నీ గంభీర గర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి. నీది రతనాల బొజ్జ.
కృష్ణవేణీ ! నీలనదీ ! ప్రేమమయీ! అనేకాంధ్ర సార్వభౌమ సహచరీ ! ఆంధ్రాంగనా ! నీవు నిర్మలాంగివై, నిత్య సృష్ఠిని, లోకానికి పాటపాడి వినిపిస్తూ ఉంటావు. ప్రతి యామినీ నీరవ ఘటికలలో నీ అక్క గోదావరితో హృదయమార వాకోవాక్యాలు పలుకుతూ ఉంటావు. నీవు ఆంధ్ర వసుందరా నీల మేఖలవు.
గోదావరి ఏకావళి, మహానదీ తపతులు ఆయమ్మ బాహువులు. నర్మద చెంపనరులు. కావేరి వేగైలు ఆమెకు మంజీరాలే.
కృష్ణవేణీ! దివ్యసుందరీ! మనోహరనృత్య విలాసినీ ! నమో నమస్తే అంటూ కృష్ణవేణీ నదికి నమస్కరిస్తూ ప్రారంభించారు అడివి బాపిరాజు గారు తమ చారిత్రాత్మక నవల అడవి శాంతిశ్రీ ని. దీనితోపాటు ఈ సంపుటిలో వారిదే మరో చారిత్రాత్మక నవల అంశుమతి కూడా ఉంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good