చిన్నపిల్లల కథలు అంటే కేవలం వారికి హాయిగా జోలపాడి నిద్ర పుచ్చేవి కావు. నిజానికి వారిని నిద్రనుంచి మేలుకొల్పాలి. ప్రపంచంలో ప్రమాదాల పాలుగాకుండా మంచిచెడ్డలు తెల్పాలి. పెద్దల పట్ల గౌరవం, ఇతరులకు సాయపడే గుణం, నైతిక విలువలు మొదలైనవి నేర్పాలి. అందుకు ఈ చిరు పొత్తంలోని కథలు తప్పక తోడ్పడతాయి.
ఈ తోడ్పాటుతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా పెద్దది. పిల్లల పెంపకంలో కేవలం ప్రేమ ఉంటే చాలదు. వారికి సకల సౌకర్యాలు కలిగించటం, అడిగినా అడగకపోయినా స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్లు, లాప్టాప్లు కొనిపెట్టటం - ఇలాంటి వాటి వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు కాని అవి వారి మానసిక వికాసానికి పెద్దడగా తోడ్పడవు. పైగా ఆ సాధనాలు వ్యసనాలుగా మారి పెడదారి పట్టించటం కూడా చూస్తున్నాం.
బాలలకు ఆధునిక విజ్ఞానంతో పాటు వివేకమూ అవసరం. అది లోపించటం వల్లనే చిన్న చిన్న కారణాలకే పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. పెడదారులు పడుతున్నారు. కనుక తల్లిదండ్రులు గమనించ వలసిన సంగతి ఏమిటంటే పిల్లల పెంపకం కంటే ఏ వ్యాపారమూ వ్యవహారమూ సంపాదనా గొప్పవి కావు.
పిల్లలకు సంపద కన్న సంస్కారం ఇవ్వటం గొప్ప విషయం.
పేజీలు : 56