126 శ్లోకాల ''సుహృల్లేఖ'', 500 శ్లోకాలు, ఐదు పరిచ్ఛేదాలుగా ఉన్న ''రత్నావళి'' రెండూ లేఖలే. 'శిష్యలేఖ'గా చెప్పే ప్రశమణేర కారికలు మరొకలేఖ. నాగార్జునాచార్యుని పేరుమీదుగా టిబెట్టులో ప్రసిద్ధిలో ఉన్నా, కర్తృత్వం సందేహాస్పదం. మొదటి రెండు లేఖలలో రాజును సంబోధించే శ్లోకాలున్నాయి.

సుహృల్లేఖ, రత్నావళి తాత్వికుల శాస్త్రచర్చకోసం వ్రాసినవి అయి ఉండవు. శ్రావకులకు, ఉపాసకులకు తత్వ ప్రతిపాదనలను పరిచయం చేసి ఆచరణ మార్గాన్ని సూచించడానికి రచించినట్లు తోస్తుంది. సంబోధించింది రాజునే అయినా అందరకు వర్తించే ఉపదేశాలెన్నో ఉన్నాయి.

పుణ్యం చేస్తే స్వర్గ ఫలితాలు కలుగుతాయని ప్రోత్సహించడం - పాపం చేస్తే నరక ఫలితాలు కలుగుతాయని మందలించటం ద్వారా ద్విముఖ శిక్షణకు (పాపవర్జనం, పుణ్యాచరణం' గృహస్థులను ప్రేరేపించ యత్నించారు. ఏవి సత్కార్యాలు, ఏవి అసత్కార్యాలు అన్నది ''సుహృల్లేఖ''లో సంగ్రహంగాను రత్నావళిలో విస్తారంగాను వర్నించారు.

సాధారణ జీవితంలోనే ధర్మాన్నిపాటించే మార్గాన్ని బోధించటం సుహృల్లేఖలోను, తత్వబోధ మరికొంత అధికంగా రత్నావళిలోను చేశారు. -వావిలాల సుబ్బారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good