కర్షకోద్యమ నిర్మాత - రంగా జీవిత విశేషాలు

బాల్యం : రైతురంగా అని మనమంతా ప్రేమగా పిలుచుకునే గోగినేని రంగనాయకుల జననం 1900 సంవత్సరం నవంబరు 7. గుంటూరు జిల్లా నిడుబ్రోలు వీరి జన్మస్థానం. తల్లిదండ్రులు అచ్చమాంబ, నాగయ్య గార్లు. పంటపొలాలు, పల్లెటూరి ఆత్మీయతల మధ్య పెరిగిన రంగా తన పెద్దమ్మ మంగమ్మ గారి నుంచి తొలి వ్యావసాయక పాఠాలు నేర్చారు. నిడుబ్రోలులో మేనమామ రామస్వామి స్థాపించిన గ్రంథాలయం వీరి పఠనాసక్తికి దోహదం చేసింది.

గాంధీ నిడుబ్రోలు రాక : 1929లో నిడుబ్రోలులోని రంగాగారి నివాసానికి గాంధీగారు రావడం సంభవించింది. కోపం తెచ్చుకోకండి, మీ అబ్బాయిని నాకివ్వండి'' అంటూ గాంధీ మంగమ్మగారిని యీ సందర్భంలో అభ్యర్థించారు. రంగాగారి జీవితంలో యిదొక మలుపు.

జమిందారీ రైతాంగ పోరాటం : జమిందారీ వ్యతిరేక ఉద్యమాలు బలంగా కొనసాగుతున్న రోజులవి. రైతులను దుర్భర దారిద్య్రంలోకి నెడుతూ, పన్నులు పేరిట అక్రమగా దోచుకుంటూ సాగుతున్న జమిందారీ వ్యవస్థకు చరమగీతం పాడాలన్న దీక్షతో, 1929 ఆగష్టు 14వ తారీఖునాడు రంగాగారు జమిందారీ రైతు సంఘాన్ని స్థాపించారు. రామానాయుడు గారిని ప్రోత్సమించి, ''జమీన్‌రైతు'' పత్రికను నెలకొల్పి జమిందార్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపారు. ఊరూరా కరపత్రాలను పంచి, పన్నులను కట్టవద్దని ఉద్బోధిస్తూ ప్రచారం చేశారు. ఉద్యమ ప్రభావం క్రమంగా మందస, మునగాల, చల్లపల్లి ప్రాంతాలకు విస్తరించింది....

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good