'హాస్యరసరాజ్యాధినేత వుడ్‌హౌస్‌ కథల్లో విహరించే జీనియస్‌ అయిన జీవ్స్‌ పాత్రే - ఈ ఇంపైన తెలిగింపు కథల్లో ఆచలపతి - మైనర్‌బాబు వురఫ్‌ పిల్ల జమిందారు బెర్టీ వూస్టర్‌ అతి గడుసుగా తెచ్చిపెట్టుకునే కష్టనష్టాలలో అతడిని కాపాడి గట్టెక్కించే సూత్రధారి.
ఈ వుడ్‌హౌస్‌ కథలను ఎమ్బీయస్‌ ప్రసాద్‌ గారు తెలుగులో చెప్పారు. ఇది అనువాదం కాదు - అనుసృజనా కాదు...తెన్గింపుకాదు..సొంపైన తెలుగింపు.
నాకు తెలిసిన ఒక 18 ఏళ్ళ విద్యార్ధి - 'హాసం' పత్రికలో ప్రసాద్‌ వ్రాసిన కథలు చదివి, రుచి మరిగి మరిగి - తన పుట్టిన రోజు కానుకగా బట్టలూ బంగారాలూ కొనవద్దని తల్లిదండ్రులకి చెప్పి - హైదరాబాద్‌ వాల్డెన్‌ షాపులో నాలుగువేల రెండు వందల రూపాయలతో వుడ్‌హౌస్‌ సాహిత్యం సెట్టు కొనిపించాడు. ఇంతకన్నానంద మేమిరా!''

Write a review

Note: HTML is not translated!
Bad           Good