''నెపోలియన్‌, జూలియస్‌ సీజర్‌ వాషింగ్టన్‌ వంటి మహాశయుల గొప్పతనం చంద్ర కాంతి అయితే లింకన్‌ గొప్పతనం స్వయంప్రకాశమైన సూర్యకాంతి లాంటిది. లింకన్‌ కీర్తి అజరా మర మైనది. ఆయన అమెరికా దేశం కన్నా, అమెరికా అధ్యక్షులందరికన్న గొప్పవాడు. ఆయన ఒక ధృవతార. ఆయన కీర్తి ప్రపంచం వున్నంతవరకు వెలుగొందుతూ వుంటుంది'' అని ప్రసిద్ద రష్యన్‌ నవలా రచయిత టాల్‌స్టాయ్‌ 1909లో ప్రశంశించారు.

ప్రజాస్వామ్యం అంటే ''ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం'' అని లింకన్‌ రెండు దశాబ్దాలకు పూర్వం నిర్వచించారు. అదే నేటికి ప్రపంచ దేశాలకు శిరోదార్యం.

అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి, పాఠశాలకు వెళ్ళే అవకాశం లేక, జీవనాధారం కోసం కట్టెలు కొట్టి, పడవలు నడిపి స్వయంకృషి, పట్టుదలతో లాయర్‌ అయి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడుగా ఎన్నికయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అధ్యక్షుడు అబ్రహంలింకన్‌ జీవిత చరిత్ర.

Write a review

Note: HTML is not translated!
Bad           Good