మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి  వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్లి చేసుకుంది ? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని వున్నది ! నేను చచ్చిపోతే అన్ని సమస్యలూ తీరిపోతాయి.
గాయత్రిని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు.
ఆ మాట ఇంకెపుడు అనకు.
ఈ సమస్యకి యింకే పరిష్కారమూ లేదంటే అదే మార్గం ! ఎప్పటికైనా చచ్చిపోవలసిన వాళ్ళమే ! ఆనంద్ కి మనం ఈ మాట చెప్పలేనట్లయితే మృత్యువునే వెతుక్కుందాం ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం .
మౌనంగా వున్నా మీ మానస వీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి నవలా రాజం 'అభిశాపం ' .

Write a review

Note: HTML is not translated!
Bad           Good