ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

అభినేత్రి

''రాజేశ్వరీ ఆర్ట్స్‌'' నాట్యమండలి వారు నిర్వహించే నాటకం చూడటానికి జనం తండోప తండాలుగా రాకపోయినా నాట్యమండలి నడవడానికి డబ్బు వస్తుంది.

దాని మేనేజర్‌ సభాపతి బయటికి వచ్చి ఒకసారి ఆదుర్దాగా జనాన్ని చూసి వెళ్ళబోయాడు. పరుగెత్తుకుంటూ వచ్చే తబలిస్టు సాయినాథ్‌ కనిపించాడు.

''రాణి బస్సుస్టాండులో లేదు గురూ!'' ఒగరుస్తూ చెప్పాడు.

సభాపతికి ముచ్చెమటలు పోశాయి. ''కనకతార'' ఆడతామని టిక్కట్లు అమ్మారు. మధ్యాహ్నం కథానాయికగా వేసే అమ్మాయి రాణి సభాపతితో పోట్లాడింది. అంతమాత్రానికే చెప్పకుండా పోతుందనుకోలేదు.

''ఇప్పుడెలా?''

''పోనీ, దమయంతిని వేషం వెయ్యమనండి.''

''నీకు బుర్రుందా సాయీ! ''కనకతార'' కథ కోసం వస్తారటోయ్‌ జనం. ఆ రాణిది పిటపిటలాడే వయసు, మత్తెకించే అందం, దానికోసం వస్తారు.''

''పోనీ, అనివార్యకారణాల వల్ల నాటకం వెయ్యటం లేదని ప్రకటిద్దాం.''

''ఈ నాటకాల కోసం బంగారం లాంటి పొలం, మేడ అమ్మాను.  ఇక కాళ్ళు చేతులే మిగిలాయి. అవి విరగకొట్టుకోమంటావా?''

''మరేం చేద్దాం? అరగంటే వుంది సమయం.''

ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు. సభాపతి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తలపంకించాడు....

పేజీలు :159

Write a review

Note: HTML is not translated!
Bad           Good