"నేనేం యివ్వగలను నీకు ? పెళ్లి అయినదాన్ని ! పిల్లలు గల దాన్ని !  నువ్వు నా  జీవితంలో చాలా లేట్ గా వచ్చావు. అది నా దురదృష్టం. నాకు ఏడుపు వచ్చేసింది. సోఫాకి తల ఆనించుకుని మౌనంగా రోదించ సాగాను. అతడు నా చేయి రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.
హేమూ అది నా దురదృష్టం కూడా ! నువ్వు నీలో పడుతున్న ఘర్షణ ఏమిటో నాకు అర్ధం అయింది. - అతడు నా వీపు మీదికి వంగాడు. నా తల మీద ముఖం ఆనించాడు. "ఐ లావ్ యు హేమూ " అన్నాడు. నేను ఏడుస్తూనే అతని వైపుకు తిరిగాను.
నన్ను నమ్ము నేను నీ వాడిని నీ త్యాగాల ఘోషణతో నన్ను బలి పశువుని చెయ్యకు. నువ్వు చేస్తానన్నా నేను ఒప్పుకోను . ఆతను నన్ను దగ్గరికి తీసుకున్నాడు. మరింత దగ్గరగా తీసుకుంటూ..
హేమకు సంప్రదాయాలన్నా కట్టుబాట్లన్నా ఏంతో నమ్మకం, గౌరవం , మగవాడు సంపాదించాలి. ఆడది ఇల్లు చక్కదిద్దాలి . అదే సరైన జీవన క్రమం అని అనుకునేది.
మల్లిక్ తో ఆమె పెళ్లి ఓ పీడకలే అయింది. ఒకనాడతడు నిపాదిగా ఫోన్ చేసి, తిరుపతిలో నేనూ సరితా పెళ్లి చేసుకున్నాం. అన్న కబురు చెప్పాడు. ఆమె జీవితం కష్టాల ఊబిలో కూరుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె తోడుగా  నిలిచాడు సౌమిత్రి.
స్త్రీ గృహిణి కాక ముందే తనకెదురయ్యే సమస్యలను ఎలా ఎడుర్కొనాలో నేర్చుకోవాలని, అందుకు తగిన శిక్షణ ఉండాలని ప్రతిపాదించే యద్దనపూడి సులోచనారాణి నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good