Abhagya Jeevanaala Bhagyanagaram
Rs.80.00
In Stock
Author: Kavini Aluri

Publisher: Trilochana Publications
-
+

''జంగవ్వా... మేం ఆలుమగలం 25 ఏళ్ళ కింద వచ్చినాం ఈడికి... ఆడ గుడిసెలు ఏసుకుని వున్నాం... గుడిసెలు పీకేసిరి బిల్డింగులు కట్టిరి.... ఈడి కొస్తిమి... అయిదారేళ్ళు ఉన్నాం.... గుడిసెలు కాలబెడ్తం... పీకేస్తం... అని ఆళ్ళొచ్చిరి, ఈళ్ళొచ్చిరి, కవర్లు కోసేసిరి, అయిగుంజిరి, ఇయి గుంజిరి... గుడిసెలు పీకేసిరి.. ఆడబోయి గుడిసెలు కాకుండా ఒంటిగా పండుకున్నాం. మళ్ళొచ్చి ఈడేసుకున్నాం... మళ్ళీ ఈడొచ్చినాక ఈడపీకేసిరి... మళ్ళా పీకేస్తిరే అని చెప్పి మళ్ళా ఇక్కడేస్తిమి... కరెంటు, బోర్లు ఏసిరి...! ఇక్కడే తిరుగుతున్నాం... అక్కడా... ఇక్కడా... ఏసుకుంటూ... ఏసుకుంటూ గుడిసెలను ఇట్లా అయ్యాయి... మళ్ళీ ఏడ బోవాలో? ఏమో?''

హైదరాబాదు అనగానే అందరిలో మెదిలేవి మెట్రో రైలు, అధునాతన షాపింగ్‌ మాల్స్‌, రింగు రోడ్లు, ఏసీ బస్సులు వంటి హంగులే. కాని, లక్షలాదిమంది రెక్కాడితే గానీ డొక్కాడని అభాగ్యులు నగర మురికివాడల్లో బిక్కుబిక్కుమంటూ బతుకులు నెట్టుకొస్తున&ఆనరనే నిజాలు తెలియవు. పరిశ్రమల కాలుష్యాల మధ్య దుర్భర జీవితం ఈడుస్తున్న కార్మికులను మురికివాడల్లో, మూసీ పరీవాహక ప్రాంతాలలో బతుకుతున్న అభాగ్యులను కలిసి, వారి వెతలను ఆర్తితో అర్థం చేసుకుని అక్షరబద్ధం చేశారు రచయిత్రి. పూలమ్ముకునే స్త్రీలు (లక్ష్మీబాయి, సనాఫాతిమా, అస్మాత్‌ బేగం), చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బడుగు జీవులు (ఇమ్రాన్‌, వెంకట్‌), టీ కొట్టుతో సంసారాన్ని నెట్టుకొచ్చే చిరువ్యాపారులు (బుట్టలు అల్లే లక్ష్మి) లాంటి ఎందర్నో ఇంటర్వ్యూలు చేసి, ఫోటోలతో సహా మన ముందుంచారు. - సి.సి.

పేజీలు : 90

Write a review

Note: HTML is not translated!
Bad           Good