అమృతాన్ని సేవించడం వల్ల మృత్యుంజయులుగా జీవిస్తారని, అది దేవతలకే సాధ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. దానికోసం సురులు...అనురులు క్షీర సముద్రాన్ని మధించితే ఉద్భవించింది నాటి అమృతం.

ఆరోగ్య జ్ఞానాన్ని అందించిన అపర ధన్వంతరులు జన్మించినదీ భారతదేశం. వేల సంవత్సరాల వైద్య చరిత్ర కలిగిన ఆయుర్వేద శాస్త్రం భారతీయుల వారసత్వ సంపద. ఇలాంటి భారతదేశంలో నేడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట కరువైపోతున్నది. ప్రస్తుత సమాజంలో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని గర్వంగా చెప్పుకునే నాధులు లేకపోతున్నారు. అనారోగ్యాలతో సహజీవనానికి అలవాటు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జీవన వైద్య శాస్త్రాల అధ్యయనం సారంతో ఆరోగ్యం...శాస్త్రీయం...సంప్రదాయ విషయాలతో... అన్ని వయస్సులవారి ఆరోగ్య పరిరక్షణక్షణకు 7 సంవత్సరాలుగా వెలువడుతోంది ఆయుర్వేద వైద్య ఆరోగ్య మాస పత్రిక నేటి 'అమృతం'.

వెలకట్టలేని జీవన ఆరోగ్య సమాచారం, జీవిత కాలం ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన విజ్ఞానం పెంచే పత్రికకు చందాదారులయితే ప్రతి మాసం మీ ఆరోగ్యాన్ని గుర్తు చేస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good